కాకినాడలో ఈవీఎంల గోదాముపై కలెక్టర్ తనిఖీ

2చూసినవారు
కాకినాడ నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎంల నిల్వ గోదామును కలెక్టర్ హరేంధిరప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఎన్నికల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి నెలా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్శనలో డీఆర్వో డాక్టర్ తిప్పే నాయక్, ఆర్డీవో మల్లిబాబు సహా ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :