నామినల్ రోల్స్ లో తప్పులు సరిదిద్దుకోండి: డీఈవో

3చూసినవారు
నామినల్ రోల్స్ లో తప్పులు సరిదిద్దుకోండి: డీఈవో
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. విద్యార్థుల ఆధార్ వివరాలతో సరిపోలిన పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్‌ను మాత్రమే యూడైస్ పోర్టల్‌లో సరిదిద్దాలని డీఈవో రమేష్ తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు ఈ వివరాలను నిర్ధారించుకోవాలి. ఈ అవకాశం మార్చి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, జిల్లాలోని డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్