చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా కాకినాడలో పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ రిపోర్టర్ అంజిబాబు మాట్లాడుతూ, విలేకరులపై దాడులు చేసిన వారిని శిక్షించాలని కోరారు. ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు.