డీఎంఈగా డా. విష్ణువర్ధన్ నియామకం.. వైద్య వర్గాల్లో ఆనందం

0చూసినవారు
డీఎంఈగా డా. విష్ణువర్ధన్ నియామకం.. వైద్య వర్గాల్లో ఆనందం
కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. విష్ణువర్ధన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)గా నియమిస్తూ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైద్య విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించిందని సహచర వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దాతల సహకారంతో రంగరాయ మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన ప్రత్యేక కృషి చేశారు. గతంలో డా. ఐవీ రావు ఈ పదవిని నిర్వహించగా, ఇప్పుడు అదే స్థాయిలో మరో కాకినాడ వైద్యుడికి అవకాశం రావడం విశేషం.

సంబంధిత పోస్ట్