కాకినాడలో నకిలీ నోట్ల ముఠా పట్టుబడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని త్రీటౌన్ సీఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వాహనాలపై అనుమతి లేకుండా ‘కేంద్ర ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్లు ఉపయోగించినట్లు గుర్తించారు. నకిలీ నోట్లు లేదా నగదు బదిలీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ప్రజలు నిర్ధారణ లేని వార్తలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు.