వరద ముప్పు: ఆటోనగర్ కార్మికుల ఆవేదన, శాశ్వత పరిష్కారం కోసం డిమాండ్

1479చూసినవారు
కాకినాడ ఆటోనగర్ కార్మికులు నాలుగు రోజులుగా వరద నీటి కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, జిల్లా కన్వీనర్ నరాల శివ ఆటోనగర్‌లో పర్యటించి కార్మికులతో మాట్లాడారు. ఏపిఐఐసి, ఇరిగేషన్, రెవిన్యూ శాఖలు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని కాళ్ళూరి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్