కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె. లచ్చారావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై, కమ్యూనికేషన్ స్కిల్స్ లో నిష్ణాతులైన 30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు సోమవారం ఉదయం 9 గంటలకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.