కాకినాడ: బాణసంచా దుకాణం వద్ద ఘర్షణ

4407చూసినవారు
కాకినాడ మెక్లరిన్ గ్రౌండ్లో బాణసంచా దుకాణాల వద్ద సోమవారం సాయంత్రం కొనుగోలుదారుడికి, షాపు యజమానికి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ బాహాబాహీకి తలపడ్డారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఘర్షణ తీవ్రమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయపడిన కొనుగోలుదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.