పదోతరగతి ఫలితాల్లో 14వ స్థానంలో కాకినాడ జిల్లా

3చూసినవారు
పదోతరగతి ఫలితాల్లో 14వ స్థానంలో కాకినాడ జిల్లా
పదో తరగతి ఫలితాలలో కాకినాడ జిల్లా 86.08 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానానికి పరిమితమైంది. జిల్లాలో మొత్తం 13,932 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 11,738 మంది (84.26%) ఉత్తీర్ణులయ్యారు. బాలికల విషయానికొస్తే, 14,357 మందికి గానూ 12,609 మంది (87.84%) ఉత్తీర్ణత సాధించారు. గతంతో పోలిస్తే జిల్లా వెనకంజ వేయడం చర్చనీయాంశమైంది. బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్