పాసింజర్ ఆటోలు వలన గూడ్స్ ఆటోలకు తీవ్ర నష్టం కలుగుతుందని కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వైవి రమణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాసింజర్ ఆటోలు నడపడం వలన దాని ప్రభావం గూడ్స్ ఆటోల పై పడుతుందని తెలిపారు.