కాకినాడ: నేడు ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

12చూసినవారు
కాకినాడ: నేడు ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం 110 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. సోలార్ సిస్టం, పేటీఎం, ఎస్బీఐ సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివినవారు శుక్రవారం ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్