కాకినాడలోని గిరిజన విద్యార్థి బాయ్స్ హాస్టల్ ను ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జయరాం గురువారం సందర్శించారు. 300 మంది విద్యార్థులకు ఒకే హాస్టల్ ఉండటంతో రూములు సరిపోక, మౌలిక సదుపాయాల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులకు సరిపడా నూతన భవనాలను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.