కాకినాడ: నాలుగు దుకాణాల్లో చోరీ

587చూసినవారు
కాకినాడ: నాలుగు దుకాణాల్లో చోరీ
కాకినాడ పెద్ద మార్కెట్ ఆవరణలోని నాలుగు దుకాణాల్లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దొంగలు సతీష్ తదితరులకు చెందిన దుకాణాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం. నాలుగు బియ్యం దుకాణాల్లో తాళాలు పగలగొట్టి వస్తువులు చిందర వందరగా పారేయడంతోపాటు రూ. 20 వేల నగదును ఎత్తుకెళ్లారు. అలాగే ఇదే ప్రాంతంలోని మరో మూడు దుకాణాల తలపులు విరగ్గొట్టి దొంగతనం చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్