సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు మెరైన్, మత్స్యశాఖ అధికారులు గస్తీని ముమ్మరం చేశారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం ప్రత్యేక మోటార్ బోటును ప్రారంభించారు. ఈ బోటు 8 కిలోమీటర్ల మేర గస్తీ నిర్వహిస్తుంది. నిబంధనలు అతిక్రమించి వేటకు వెళ్తే బోట్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.