కాకినాడలో శానిటేషన్ వైఫల్యానికి ప్రధాన కారణం సిబ్బంది కొరతేనని, దీనిపై అధికారులను నిందించడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు అన్నారు. గతంలో 2.5 లక్షల జనాభాకు 1250 మంది సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 5.7 లక్షల జనాభాకు కేవలం 600 మంది మాత్రమే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. వాహనాలు, పరికరాలు, రక్షణ సామగ్రి కూడా తగినంత లేవని ఆయన విమర్శించారు.