కాకినాడ నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ షన్మోహన్ తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ హెల్త్ తదితర విభాగల ఆదాయ వనరులపై ఆరా తీశారు. పూర్తిస్థాయిలో ఆదాయాన్ని పెంపొందించడం ద్వారా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సత్యనారాయణకు సూచించారు.