కాకినాడలో 30న మాక్ డ్రిల్ నిర్వహణ

5చూసినవారు
కాకినాడలో 30న మాక్ డ్రిల్ నిర్వహణ
కాకినాడ జిల్లాలోని ఆయిల్, రసాయన పరిశ్రమల్లో విపత్తుల నివారణకు సంబంధించి ఏప్రిల్ 30న మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులతో కలిసి ఏర్పాట్లు చర్చించారు. ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని ఆయన తెలిపారు. విపత్తు నిర్వహణ సంస్థ సూచనల మేరకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్