కాకినాడకు చెందిన తాటికాయల దివాకర మారుతి సత్యతేజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాకు ఓ మహిళ వాట్సాప్ స్టేటస్ ఫోటోలను డౌన్‌లోడ్ చేసి అవి మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పెట్టాడని ఫిర్యాదు చేయడంతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో అక్కడి సీపీ శంఖబ్రత బాగ్బీ ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.