కాకినాడలోని ఓ లాడ్జిపై త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మిక దాడి నిర్వహించారు. దొంగనోట్ల చలామణి, నగదు బదిలీలు జరుగుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం, రాజమండ్రికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వ, డిజిటల్ మీడియా స్టిక్కర్లు ఉన్న రెండు కార్లు, డబ్బు లెక్కించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు కాలేదని సీఐ వెల్లడించారు.