కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 47 అర్జీలు స్వీకరించబడ్డాయి. ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. అందిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలకు సంబంధించినవి 15, భూ వివాదాలకు సంబంధించినవి 13, ఇతర సమస్యలకు చెందినవి 19 ఉన్నట్లు వివరించారు. ప్రజలకు న్యాయం అందించడమే పోలీసుల ముఖ్య బాధ్యత అని, ప్రతి అర్జీపై సమగ్రంగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.