వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 07703 ప్రత్యేక రైలు మే 1, 2, 3 తేదీల్లో కాకినాడ నుంచి సాయంత్రం 6:55కు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు లింగంపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07704 రైలు మే 2, 3, 4 తేదీల్లో రాత్రి 8 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరి ఉదయం 7:45కు కాకినాడ చేరుకుంటుంది. ఈ రైళ్లు సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.