కాకినాడలో మత స్వేచ్ఛకు భంగం కలిగించే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా పాస్టర్లు, క్రైస్తవులు భానుగుడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. 'మా మతం మా హక్కు, వివక్ష వద్దు, మత స్వేచ్ఛ ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాస్టర్లు, క్రైస్తవ సహోదరులు పాల్గొన్నారు.