మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ పేర్కొన్నారు. కేంద్ర క్రీడా శాఖ నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటా భర్తీ జరిగిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని పారదర్శకంగా పూర్తి చేసిందన్నారు. నియామకాలపై అనవసర రాజకీయ విమర్శలు చేయకుండా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని
వైసీపీ నేతలకు సూచించారు.