
జిల్లా టాపర్ ను ఘనంగా సన్మనించిన కలెక్టర్
ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 987 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన గొల్లప్రోలు జూనియర్ కళాశాల విద్యార్థిని అనూషను కాకినాడ కలెక్టర్ హరీంధర ప్రసాద్ శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఆమె తల్లి గంగారత్నాన్ని అభినందించిన కలెక్టర్, ఇదే పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. విద్యార్థిని ప్రతిభను చూసి అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.







































