
ఏకీకృత కుటుంబ సర్వే మూడు రోజులలో పూర్తి చేయాలి: కలెక్టర్
కాకినాడ జిల్లాలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వేను మరో మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 7,55,812 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 6,51,697 కుటుంబాల సర్వే పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా అధికారులకు సూచించారు.





































