
కరప: 'ఆ ప్రాంతంలో ఇక ఉప్పు పంట కనపడదు'
కరప మండలం పెనుగుదురు, గుర జనాపల్లి, తాళ్లరేవు మండలం చొల్లంగిలోని కేంద్ర సాల్ట్ కమిషన్కు చెందిన 1,250 ఎకరాల భూములను ఇటీవల కేంద్రం మేరీ టైం బోర్డుకు బదలాయించింది. దీంతో ఉప్పు పండించే రైతులను ఖాళీ చేయిస్తున్నారు. ఈ భూములను ఎయిర్ పోర్టు నిర్మాణానికి పరిశీలిస్తున్నారని, దీంతో ఈ ప్రాంతంలో ఉప్పు పంట కనిపించదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







































