శుక్రవారం, జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు తాళ్లరేవు మండలం కోరంగిలోని మడ అడవులను సందర్శించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ వర ప్రసాద్ వివరించారు. తుఫాన్ తర్వాత వాతావరణాన్ని పరిశీలించడానికి ఆయన వచ్చారు. సందర్శకుల రాక ఇప్పుడే మొదలైందని అధికారులకు తెలిపారు.