వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యోగుల ధర్నా

1299చూసినవారు
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యోగుల ధర్నా
కాకినాడ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వీవోఏ యానిమేటర్లు, మెప్మా, ఆర్పీ ఉద్యోగుల సంఘాలు సోమవారం ధర్నా నిర్వహించాయి. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని, కనీస వేతనం రూ. 26 వేలు నిర్ణయించాలని, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని, రూ. 10 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాయి. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you