కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ పాత ట్రస్ట్ ఎదురుగా ఉన్న విజేత మార్ట్‌లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాగి పిండి, ఖర్జూరం వంటి పదార్థాలు నాణ్యత లోపంతో, పెంకు పురుగులతో ఉన్నాయని వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి, శాంపిల్స్ సేకరించారు. నాణ్యత లోపించినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.