సాధ్యం కాదన్న దానిని సుసాధ్యం చేశాడు

1291చూసినవారు
సాధ్యం కాదన్న దానిని సుసాధ్యం చేశాడు
పుట్టుకతో వచ్చిన మస్క్యులర్ డిస్ట్రోఫీ (కండరాల బలహీనత)తో బాధపడుతున్న కాకినాడకు చెందిన రామ్ చరణ్ తేజ, తన సంకల్ప బలంతో పదో తరగతి పరీక్షల్లో 400కు 338 మార్కులు సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. నరసన్ననగర్‌లోని గీతం పాఠశాలలో చదువుతున్నఅతను నడవడానికి, కదలడానికి కూడా సాధ్యపడదు. అలాంటిది స్క్రైబ్ సహాయం తీసుకోకుండా స్వయంగా పరీక్ష రాసి విజయం సాధించాడు. అతని తండ్రి మాత్రమే ప్రతిరోజూ అతన్ని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేవారు.  సాధ్యం కాదన్న దానిని సుసాధ్యం చేశాడు. ఈ అసాధారణ విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

సంబంధిత పోస్ట్