బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం,గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.