కాకినాడ బీజేపీ జిల్లా మీడియా ఇన్చార్జిగా చక్ర రమేశ్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మంగళవారం సాయంత్రం ఆయనకు నియామక పత్రం అందజేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు విస్తృతంగా చాటిచెప్పాలని రమేశ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేత ఎనిమిరెడ్డి మాలకొండయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను మీడియా ద్వారా మరింతగా ప్రచారం చేయాలని సూచించారు.