బీజేపీలో భారీగా చేరికలు

4చూసినవారు
బీజేపీలో భారీగా చేరికలు
కాకినాడ వెస్ట్ మండలంలో బీజేపీకి కొత్త ఊపిరి లభించింది. సోమవారం జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బంగారు దుర్గ భవాని సమన్వయంతో, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి నాయకులు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్