పెట్రోల్ కొరతకు కారణం ప్రభుత్వాలభాధ్యతఆమ్ఆద్మీపార్టీ ఆగ్రహం

1052చూసినవారు
పెట్రోల్ కొరతకు కారణం ప్రభుత్వాలభాధ్యతఆమ్ఆద్మీపార్టీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అంతటా పెట్రోల్ బంకులలో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. పెట్రోల్, డీజిల్ కొరత సామాన్యులకు భారంగా మారిందని, నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రైతుల ఉత్పత్తుల రవాణాకు ఆటంకం ఏర్పడిందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకలవరద రాజసాంచి, అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ కాకినాడలో అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపు లేకపోవడం, విదేశాంగ విధాన లోపాలే ఈ దుస్థితికి కారణమని, తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్