కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ అర్జీలను సమర్పించవచ్చని సూచించారు. కలెక్టరేట్‌కు రాలేని వారు Meekosam. ap. gov. in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని, 1100 నెంబర్‌కు డయల్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.