పెదపూడి మండలం, కుమారప్రియం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ అధ్యక్షునిగా పెద్దాడ గ్రామానికి చెందిన ప్రతిపాటి వీరవెంకట సత్యనారాయణ ఎన్నికయ్యారు. జనసేన నాయకుడు మట్ట గంగరాజు, టీడీపీ నాయకుడు దెయ్యాల శివ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి జుత్తుక సూర్యకుమారి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల అభ్యుదయానికి కృషి చేస్తానని, తనకు ఈ అవకాశం కల్పించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిలకు ప్రతిపాటి వీరవెంకట సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పిఎసిఎస్ చైర్మన్లు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.