కాకినాడ రూరల్ మండలంలోని పండూరు, తూరంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా వర్కర్లు తమ జీతాలను పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సిఐటియు మండల కార్యదర్శి టి. రాజా మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని, యాప్‌ల భారం తగ్గించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు బేబీ వెంకటలక్ష్మి, విమల, భార్గవి కుమారి తదితరులు పాల్గొన్నారు.