విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

994చూసినవారు
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
ఆదివారం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి దుగ్గుదూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొప్పిశెట్టి అన్నవరం (67) మృతి చెందారు. సోమ, మంగళవారాల్లో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, పొలానికి సమీపంలోని విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వద్ద తుప్పల్లో మృతదేహం కనిపించింది. ఇటీవల భార్య మృతితో కుమార్తె ఇంట్లో ఉంటున్న అన్నవరం మృతిపై గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.