వేంకటేశ్వర స్వామి రథోత్సవం.. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

2చూసినవారు
వేంకటేశ్వర స్వామి రథోత్సవం.. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
యానాం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. మీసాల వెంకన్న తీర్థంగా ప్రఖ్యాతి పొందిన ఈ వేడుకలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త బస్టాండ్ వద్ద రథంలో కొలువుదీరిన స్వామి వారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

ట్యాగ్స్ :