వేట్లపాలెం ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: ఎంపీ ఉదయ్

6చూసినవారు
వేట్లపాలెం ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: ఎంపీ ఉదయ్
కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం సామర్లకోట మండలం, వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుళ్లలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. సోమవారం, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్