
భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి
ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో ఉన్న ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అధికారులు వేకువజాము నుంచే దర్శనాలు కల్పించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేశారు.
































