ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నమ్మాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ స్వామి వారి సన్నిధిలో విశేష పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని, నమ్మాళ్వార్లను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై ఉంచి, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయ ప్రాకారోత్సవం చేశారు. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.