ఆలమూరు: గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం

10చూసినవారు
ఆలమూరు మండలం జొన్నాడ-రావులపాలెం మధ్య గోదావరి నదిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఎస్ఐ నరేష్, సిబ్బంది సహాయంతో బయటకు తీశారు. సుమారు 50 ఏళ్ల వయస్సున్న ఈ వ్యక్తి మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :