ఆత్రేయపురం పూతరేకుల దుకాణాలపై అధికారుల ఆకస్మిక దాడులు

4చూసినవారు
పూతరేకుల తయారీలో నాణ్యత లేని నెయ్యి వాడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, కోనసీమ జిల్లా ఆహార భద్రతా అధికారి రామయ్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం ఆత్రేయపురం, రేవు, ఉచ్చిలి ప్రాంతాల్లోని దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నెయ్యి, జీడిపప్పుతో సహా 10 నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. లైసెన్స్ లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వైద్యాధికారి హైమశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్