రావులపాలెంలోని వెదిరేశ్వరం రోడ్డులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విగ్రహం ఏర్పాటు కార్యక్రమంలో దౌర్జన్యం చేసి, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిర్ల జగ్గిరెడ్డి, గొల్లపల్లి డేవిడ్, ఏనుగపల్లి నాగార్జున, ఇసుకపట్ల సునీల్, కొల్లాటి డాక్టర్ బాబు, వెంకటేశ్వర రావు, రాజశేఖర్, నాగమహేశ్వరరెడ్డి, నెల్లి రాజులపై ఎస్సై చంటి గురువారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.