కాటన్ పడవ పోటీలు ప్రారంభం.. పడవ నడిపి అలరించిన కలెక్టర్

20చూసినవారు
ఆత్రేయపురం మండలంలోని తాడిపూడి వంతెన వద్ద సర్ ఆర్థర్ కాటన్ పడవల పోటీల ట్రయల్ రన్‌ను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా కానోయింగ్ పడవ నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ వేడుకల్లో ఆర్‌డీఓ పి.శ్రీకర్, ఎండీఓ వెంకట రామన్, స్థానిక నేతలు పాల్గొన్నారు. నది అలలపై పడవల జోరును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్