ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 99,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 64,33,898 ఆదాయం సమకూరింది. ఇందులో ఆన్‌లైన్ ద్వారా రూ. 13.35 లక్షలు, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 33 లక్షలకు పైగా ఆదాయం లభించింది. భక్తుల రద్దీ దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 524 మందికి వైద్య సేవలు అందించారు. లడ్డూ ప్రసాదం విక్రయాలు భారీగా జరిగాయి, అన్నదాన కార్యక్రమాలకు కూడా భక్తులు విరాళాలు అందజేశారు.