వాడపల్లి వేంకటేశ్వరుని సన్నిధిలో 'ధర్మపథం' నృత్య ప్రదర్శన

2చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజయనగరానికి చెందిన అమృత శ్రీ వార్షిణి నృత్య కళాశాల విద్యార్థులు ఆలయ ప్రాంగణంలో ‘ధర్మపథం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఈ క్లాసికల్ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రతిభను ఆలయ అధికారులు, భక్తులు అభినందించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్