కొత్తపేట నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. వరి కోతలు జరుగుతున్న సమయంలో పలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం సరఫరాలో యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆదివారం ఆరోపించారు. పంట చేతికొచ్చే సమయంలో ఇంధనం అందక కోత యంత్రాలు, రవాణా వాహనాలు నిలిచిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.