ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారు. శనివారం రావులపాలెం బస్టాండ్ మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వాడపల్లి వెళ్లే ప్రత్యేక బస్సుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉండటంతో భక్తులు, ప్రయాణికుల రద్దీ పెరిగింది. మహిళలు బస్సులు ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. అయితే, తోపులాటలు లేకుండా జాగ్రత్తలు వహించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.